Arunachal: LAC Village Mentioned in US Report in China-Controlled Territory

Arunachal: LAC Village Mentioned in US Report in China-Controlled Territory

అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవాధీన రేఖ-LAC వెంబడి.. చైనా నిర్మించిన గ్రామం.. ఆ దేశ నియంత్రణలో ఉన్న భూభాగంలోనే ఉందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని వివాదాస్పద ప్రాంతంలో.. చైనా గ్రామాన్ని నిర్మించిందని అమెరికా సైన్యం వార్షిక నివేదికలో పేర్కొంది. మెక్ మెహ న్ రేఖ కు దక్షిణాన భారత సరిహద్దుల్లో ఈ గ్రామం ఉన్నట్లు నివేదిక వివరించింది. అరుణాచల్ లోని భారతభూభాగం పరిధిలో డ్రాగన్ ఓ గ్రామం నిర్మించిన విషయాన్ని ఉపగ్రహ ఛాయాచిత్రం ఆధారంగా ఓ ఇంగ్లిష్ టీవీ ఛానెల్ ఈ ఏడాది ఆరంభంలో ఓ వార్తా కథనం ప్రసారం చేసింది. ఈ గ్రామాన్ని చైనా 2020 మధ్యలో ఎప్పుడో నిర్మించి ఉంటుందని అమెరికా రక్షణశాఖ పేర్కొంది. భారత్-చైనా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో చైనా వంద ఇళ్లు నిర్మించినట్లు.. అమెరికా రక్షణ శాఖ తమ పార్లమెంటుకు ఓ నివేదిక సమర్పించింది. ఐతే సుబాన్ సిరి జిల్లా వద్ద ఉన్న వివాదాస్పద సరిహద్దు వెంబడి చైనా గ్రామం నిర్మించుకుందని భారత వర్గాలు తెలిపాయి. ఈ గ్రామం 60 ఏళ్లుగా చైనా నియంత్రణలో ఉన్న ప్రాంతంలోనే ఉందని పేర్కొన్నాయి. 1959లో ఆ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని, అప్పటి నుంచి నిర్మాణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments